calender_icon.png 10 January, 2026 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింహగర్జనకు ఆర్యవైశ్యులు తరలిరావాలి

10-01-2026 02:13:56 AM

  1.   11న హనుమకొండలో సభను నిర్వహిస్తాం
  2. వరంగల్ ఆర్యవైశ్య జేఏసీ సాధన కమిటీ కన్వీనర్ గట్టు మహేష్‌బాబు 

హనుమకొండ టౌన్, జనవరి 9 (విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్‌లో ఈనెల 11న మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఓసీ సింహగర్జన సభను విజయవంతం చేయాలని ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు గట్టు మహే ష్‌బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ సభ ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూ లల నుంచి ఆర్యవైశ్యులందరూ సభకు అత్యధికంగా తరలిరావాలని అన్నారు.

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వరంగల్ జిల్లా (ఐవీఎఫ్) ఆధ్వర్యంలో వరంగల్ ఆర్యవైశ్య ఓసీ జాక్ పోరాట సాధన కమిటీ నిర్వహిస్తున్న ఈ గర్జన సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ట్లు తెలిపారు.ఓసీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.

రా జ్యాంగం ప్రకారం ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, రాజ్యాంగం ప్రకారం నిర్దేశించిన ఈడబ్ల్యూఎస్ హక్కును మాత్ర మే తాము కోరుతున్నామన్నారు. ఓసీలు తమకు రాజ్యాంగబద్ధంగా సక్రమించిన హ క్కును సాధించేవరకు సంఘటితమవుతున్నారని, ఇందులో భాగంగానే ఓసీ సింహగ ర్జన సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సభకు ఆర్యవైశ్యులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.