calender_icon.png 10 January, 2026 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్

10-01-2026 02:13:56 AM

శ్రీచైతన్య స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, జనవరి 9: శ్రీచైతన్య స్కూ ల్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణా రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ ముగింపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. హైదరాబా ద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో వాలీబాల్, త్రోబాల్, ఖోఖో, 100 మీటర్ల పరుగు పం దెం, షాట్‌పుట్ వంటి పోటీలు విద్యార్థులకు నిర్వహిం చి విజేతలకు మెమోంటోలు, ప్రశంసాపత్రా లు అందజేశారు. దాదాపు 630 మంది అ త్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థు లు ఫైన ల్ పోటీల్లో పాల్గొన్నారు. ఇంతకుముందు దే శవ్యాప్తంగా 20కిపైగా రాష్ట్రాల్లో ఉన్న శ్రీచైతన్య స్కూల్‌కి చెందిన 685 బ్రాం చిల్లో బ్రాంచి లెవల్ పోటీలు నిర్వహించారు.

తెలంగాణాలోని 90 బ్రాంచిల నుంచి 59, 778 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి బ్రాంచి నుంచి 138 మంది వి ద్యార్థులను జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేయగా, ఈ పోటీల్లో 12,420 మం ది పా ల్గొన్నారు. శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్‌పర్సన్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి ముఖ్య అ తిథిగా నిర్వహించిన కార్యక్రమంలో విదా సంస్థల డైరెక్టర్ బొప్పన సీమ, మాదాపూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రీతిరాజ్, తెలంగాణ ఈగిల్ ఫోర్స్ ఎస్పీ సీతారాం, ఇం డియన్ వాటీబాల్ టీం మాజీ కెప్టెన్ వెంకట నారాయణ, సినీ నటుడు కిరణ్ అబ్బవరం, సినీ డైరెక్టర్ వీఎన్  ఆదిత్య, ప్రముఖ టీవీ న టుడు రామ్‌ప్రసాద్ గౌరవ అతిథులుగా పా ల్గొన్నారు. విద్యాసంస్థల డైరెక్టర్ బొప్ప సీమ విజేతలను అభినందించారు.