06-09-2025 12:00:00 AM
కల్వకుర్తి , సెప్టెంబర్ 5: కల్వకుర్తి పట్టణంలోని వాసవి నగర్ కు చెందిన బాల య్య(70) కుమార్ రెడ్డి చేతిలో ధారణ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మూడు రోజుల క్రితం వ్యవసాయ పొలం వద్ధ తన కుమారుడు బీరయ్య కర్ర తో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గు ర్తించగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తం డ్రిని చంపి కారులో తీసుకెళ్లి డిండి చింతపల్లి వద్ద దుందుభి నదిలో మృతదేహాన్ని పడేసినట్లు తెలుస్తుంది. దీంతో శుక్రవారం కల్వ కుర్తి పోలీసులు దుందుభి వాగు వద్దకు వెళ్లి మృతదేహం కోసం గాలిస్తున్నారు.