calender_icon.png 22 October, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం రాజనాల శ్రీహరి దరఖాస్తు

21-10-2025 06:07:40 PM

వరంగల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా బీసీ నేత, విద్యావంతుడు, సీనియర్ రాజకీయ నేత రాజనాల శ్రీహరికి అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ కు దరఖాస్తు సమర్పించారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్న నాయకుడు, అందరితో కలుపుగోలుగా ఉండి, పార్టీ కార్యకర్తల కు వెన్నుదన్నుగా ఉండే నాయకుడే అధ్యక్షుడుగా కావాలని కార్యకర్తలు, శ్రీహరి అభిమానులు కోరుకుంటున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో బీసీ కులాల అన్నింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చి సమన్వయం చేసే సత్తా ఉన్న ఏకైక సీనియర్ నాయకుడుగా రాజనాల శ్రీహరికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 35 సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవం కలిగి, అనేకమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తిగా పేరుపొందాడు.

1989 నుండి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ,1996లో ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉంది. పేద ప్రజలకు నిత్యం ఏదో రూపంలో ఆర్థికంగా సహాయం చేసే వ్యక్తిగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మంచి సలహాదారు నీగా, అనేక విషయాల్లో చేదోడువాదోడుగా పనిచేశాడు. ప్రస్తుత టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుచరుడుగా, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా పేరు పొందిన రాజనాల శ్రీహరికి డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమయంలో బీసీ నేత రాజనాల శ్రీహరికి డీసీసీ పదవి ఇచ్చి బీసీ కులస్తులకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందని పలువురు కాంగ్రెస్ పార్టీ అభిమానులు భావిస్తున్నారు.