calender_icon.png 12 January, 2026 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుస్తులపై దృక్పథం మారాలి!

04-01-2026 12:00:00 AM

అమ్మాయి రక్షణ గురించి చర్చ వచ్చిన ప్రతిసారీ, బాధ్యులను బోనులో నిలబెట్టాల్సింది పోయి బాధితురాలి రంగు, శరీరం, ఆమె ధరించిన దుస్తుల గురించి ప్రస్తావించడం ఒక అనాగరిక సంప్రదాయంగా మారిపోయింది. ‘అమ్మాయి సురక్షితంగా ఉండాలంటే పద్ధతిగా ఉండాలి’ అని సూక్తులు చెప్పే మేధావుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది. అసలు రక్షణకు, దుస్తులకు ముడిపెట్టే  ఇలాంటి సంస్కృతి ఇంకెంత కాలం కొనసాగుతుందనేది నేడు అతిపెద్ద ప్రశ్న.

వ్యక్తుల ప్రవర్తనను ప్రశ్నించకుండా, బాధితుల వేషధారణను విమర్శించడం అంటే పరోక్షంగా నేరాన్ని సమర్థించడమే అవుతుంది. ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసే శక్తిమంతమైన సినీ రంగం నేడు మహిళల పట్ల ప్రదర్శిస్తున్న వైఖరి ఆందోళనకరం. నిజానికి, సమస్య అమ్మాయి వేసుకునే దుస్తుల్లో లేదు. అది ఎదుటివారిని చూసే చూపులో, పెరిగిన వాతావరణంలో ఉంటుంది. స్త్రీ అంటే గౌరవించాల్సిన వ్యక్తి అని కాకుండా, తను కేవలం ఒక ‘వస్తువు’ మాత్రమే అనే భావనను నేటి వినోద మాధ్యమాలు యువతలో బలంగా నాటుతున్నాయి.

అందుకే బహిరంగ వేదికలపై అసభ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పకపోగా, వాటిని ఆస్వాదించే స్థితికి సమాజం చేరుకుంది. ఇకనైనా మహిళల స్వేచ్చను దుస్తుల కొల తలతో కొలవడం ఆపాలి. ఆమెకు రక్షణగా ఉండటం అంటే హద్దులు విధించడం కాదు, ఆమె స్వేచ్ఛగా తిరిగేలా వాతావరణాన్ని సృష్టించడం అవసరం. ఏ దుస్తులు వేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెదే.  కానీ ఆమెను గౌరవించాల్సిన బాధ్యత బాధ్యత సమాజానిది. 

 దిడ్డి శ్రీకాంత్, కరీంనగర్