04-01-2026 12:00:00 AM
తెలంగాణలో 2024 డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 11 వేల టీచర్ పోస్టులు త్వరితగతిన భర్తీ చేసిన ప్రభుత్వం మరో 6 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని గత డీఎస్సీ పూర్తి చేసే సమయం లోనే ప్రకటించారు. కానీ ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ జాడ లేకుండా పోయింది. గత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయి దాదాపు రెండు సంవత్సరాలు కావొస్తోంది. పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలు కలిపి దాదాపు 12 వేల టీచర్ పోస్టు ఖాళీలు ఉన్నా యి.
ఇందులో 8 వేలు ఎస్జీటీ పోస్టులు, 4 వేలు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. మరోపక్క విద్యార్థి: టీచర్ నిష్పత్తి ప్రకారం 10 వేల ఉపాద్యాయులు మిగులు ఉన్నారని విద్యాశాఖ తమ లెక్కల్లో పేర్కొంటున్నారు. కానీ రాష్ర్ట రేషియోలో కాకుండా స్కూల్స్ వారీగా చూస్తే 12 వేల టీచర్ పోస్టు లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే విద్య సంవత్సరానికి ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరగాలంటే సత్వరమే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరముంది.
దాదా పు లక్ష మంది డి.ఎడ్ అభ్యర్థులు, 2 లక్షల మంది బి.ఎడ్ అభ్యర్థులు డీఎస్సీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని ఆకాంక్షిస్తున్నారు. జాతీయ స్థాయిలో మన రాష్ర్ట విద్య గణాంకాలు మరింత మెరుగ్గ ఉండాలంటే వెనువెంటనే ఉపాధ్యాయ పోస్ట్లులను భర్తీ చేసి ప్రభుత్వ బడులపై, ఉపాధ్యా యుల బోధనపై నిరంతరం పటిష్ఠ పర్యవేక్షణ కోసం అధికారులను మరింతగా నియమించాలి. ఏది ఏమైనా తెలంగాణ విద్య వ్యవస్థ ప్రస్తుత ప్రభుత్వ హాయంలో మరింత మెరుగు పడాలని కోరుకుందాం.
రావుల రామ్మోహన్ రెడ్డి, వరంగల్