7 August, 2026 | 2:31 AM

దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్న బీజేపీ ప్రభుత్వం

07-08-2026 12:34 AM

ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు 

సీపీఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని సీపీఐ పట్టణ కార్యదర్శి సొతుకు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు జిల్లా కేంద్రంలోని కాలనీల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కొమురయ్య భవన్ నుండి కృష్ణ కాలనీ, యాదవ్ కాలనీలలో పాదయాత్ర ప్రారంభమైందన్నారు.

ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించడంతో పాటు సెప్టెంబర్ 1న జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తూ నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలను పెంచిందని విమర్శించారు.

రైతులకు గిట్టుబాటు ధర, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, ఉచిత విద్య, వైద్యం, నిత్యావసర ధరల తగ్గింపు వంటి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రజా సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాటాలు మరింత ఉధృత మవుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు నూకల చంద్రమౌళి, ఎండి జాఫర్, నేరెళ్ల జోసెఫ్, భూక్య గణేష్, కంకల గట్టయ్య, గోలి లావణ్య, పొన్నగంటి లావణ్య, పల్లెల రజిత, గడ్డం స్వరూప, ఇటుకల శ్రీలత, పోతుగంటి స్వప్న, రాజేష్, సదానందం, పీక రవి, జనార్ధన్, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.