calender_icon.png 20 December, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం

20-12-2025 12:29:15 AM

మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

మానకొండూర్, డిసెంబరు 19 (విజయ క్రాంతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో తిమ్మాపూర్ మండలం రాజాపూర్ గ్రామ సర్పంచ్ కొంకటి రవితోపాటు వార్డు సభ్యులు గాజుల మహేందర్, కుక్కల రాజమ్మ, రెడ్డి భారతి, మాతంగి వేణు కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి విషయంలో సర్పంచులు భేషజాలకు పోకుండా వార్డు సభ్యులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు.

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడాలన్నారు. నూతన సర్పంచులు గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా సంక్షేమ పథకాల అమలులో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, మాజీ జట్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు కుర్ర ఓదెలు, గుడిపాటి శ్రీనివాస్ రెడ్డి, గట్టు తిరుపతి, బండారు తిరుపతి, గొట్టె మధు, మధుకర్, గాజుల మహేశ్, రాయిని రమేశ్, జనగాం రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.