ఈరగోల దెబ్బలు.. జమిడిక మోతలు
- హుస్నాబాద్‌లో ఇయ్యాల్టి నుంచి ఎల్లమ్మ మహాజాతర
- తెలంగాణలో మరెక్కడాలేని జానపదుల సాంస్కృతిక వైభవం
- వైశాఖ మాస శుద్ధ పౌర్ణమి, బుద్ధపూర్ణిమ.. ఇక్కడ ఎల్లమ్మపున్నం, బాసింగాలపున్నంగా ప్రసిద్ధి
- అమ్మవారికి బాసికాలతో మొదలై.. నెలరోజులపాటు సాగనున్న దళితబహుజన జాతర
హుస్నాబాద్, మే 11 : తెలంగాణలో మరెక్కడా కనిపించని విశిష్ట సంస్కృతి, జానప దుల సాంస్కృతిక వైభవం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈయేడు మరింత కొత్తగా ఆవిష్కృతమవుతోంది. వైశాఖ మాస శుద్ధ పౌర్ణమి, బుద్ధపూర్ణిమ అంటే ఈ ప్రాంతవాసులు చెప్పుకునే ఎల్లమ్మపున్నం, బాసింగాల పున్నం నుంచి ఎల్లమ్మ మహాజాతర ప్రారం భం కాబోతోంది.
తెలంగాణలోనే నెలరోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జా తర సోమవారం(మే,12) నుంచి మొదలవుతుంది. బహుజన సంస్కృతి ప్రతిబింబించే జాతరలో మొదటిరోజు జరిగే కార్యక్రమాల ను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారు లు మొదలుపెట్టనున్నారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దం పతులు, కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో పాటు ఆయన అమ్మవారికి 6 కిలోల వెండి తొడుగులు పెట్టి మొక్కలు చెల్లించుకోనున్నారు.
బోనాలు.. ఓడిబియ్యాలు.. శివసత్తుల సద్దులు
ఈరగోల దెబ్బలు, జమిడిక మోతలతో చారిత్రక రేణుకాఎల్లమ్మ ఆలయంలో ఆదివారం నుంచే సందడి మొదలైంది. కాకతీ య మహారాణి రుద్రమ ఇక్కడ చెరువు త వ్వించినప్పుడు 8 అడుగుల ఎత్తుతో ఎల్లమ్మతల్లి విగ్రహాన్ని ప్రతిష్టించి, గుడీ కట్టించిందని చరిత్రకారులు చెబుతారు. సర్ధార్ సర్వాయి పాపన్నే ఈ గుడిని కట్టించి పూజలు చేసేవాడని మరో వాదన కూడా ఉంది.
అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు వైశాఖ మాస శు ద్ధ పౌర్ణమిని ఎల్లమ్మ పున్నమిగా, బాసింగాల పున్నంగా వ్యవహరిస్తూ జాతర జరుపుతారు. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే పౌ ర్ణమి రోజు నుంచి నెలరోజుల పాటు బోనా లు, అన్న ప్రసాదాలు, ఎడ్లబండ్లు, ఊరేగింపులు, శివసత్తుల సద్దులు, ఓడిబియ్యాలతో జాతర జరుగుతుంది. వైశాఖ మాస శుద్ధ పౌ ర్ణమి రోజున జరిగే జాతరకు ముందు రోజు తెల్లవారుజామునే ఊరి పోలిమేరలో ఉన్న బీరప్ప గుడి వద్ద కొబ్బరి కాయలు కొట్టి, బో నాలు చేస్తారు.
హుస్నాబాద్కు దగ్గరలో ఉ న్న పొట్లపల్లి ఊరి పొలిమేరల్లో ఉన్న పెద్ద బండరాయికి కూడా ఎల్లమ్మ విగ్రహం చెక్కి ఉంది. ఊరి ప్రజలు ఈ విగ్రహానికి కూడా బొట్టు, బోనాలు సమర్పిస్తారు. హుస్నాబా ద్‌లో జరిగే జాతరకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.
హైదరాబాద్, మెదక్, సం గారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, న ల్గొండ, జనగామ, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల తో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, షోలాపూర్, బీదర్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ప్ర జలు వస్తారు. హుస్నాబాద్‌కు దగ్గరగా ఉ న్న ప్రాంతాల నుంచి ప్రజలు ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లు తీసుకొని వస్తున్నారు.
బో నాలు సమర్పించి, కోళ్లు, మేకలను బలి ఇ చ్చి, కల్లు సాక, బెల్లం పానకంతో అమ్మవారిని కొలుస్తున్నారు. భవిష్యత్తు తరాలకు మంచి జరగాలని మొక్కుకుంటారు. ఆలయప్రాగణంలో చెట్ల కింద నెలరోజులపాటు అ మ్మవారికి నైవేద్యం సమర్పించి ఇంటిళ్లిపాది కలిసి భోజనాలు చేస్తారు. మళ్లీ ఏడాదికి వస్తామంటూ తిరిగి ఇండ్లకు చేరుతారు.
గావుపట్టి రక్తంబొట్టు.. ఈరగోల దెబ్బలు
జాతరలో జానపద కళాకారులు గ్రామదేవతలైన ఎల్లమ్మతల్లి, పోచమ్మతల్లి చరిత్రల ను ఒగ్గు కథల రూపంలో చెప్పి అలరిస్తారు. ఎల్లమ్మతల్లి గురించి ఒగ్గు కథ, పాటల ద్వా రా విన్నప్పుడు ఎంతటి కఠిన హృదయులై నా కంటతడి పెడతారు. ప్రత్యేకంగా ఎల్లమ్మ కథ చెప్పినవారిలో అవార్డు గ్రహీతలున్నా రు.
వారిలో మిద్దె రాములు, చుక్క సత్తయ్య సుప్రసిద్ధులు. జాతరలో శారదగాండ్లు, బైం డ్లవారు, పంబాలవారు కూడా ఎల్లమ్మ కథాగాన ప్రదర్శనలు చేస్తారు. ముందుగా బో నాలు చేసిన తర్వాత వాటిని చెల్లించే కార్యక్రమంలో బైండ్ల వారు జమిడిక వాయిద్యాల ను ఉపయోగించి కథాగానం చేస్తారు. బైం డ్లవారి జమిడిక వాయిద్యానికి మాదిగల డ ప్పులు కలిసి లయబద్ధంగా వాయిస్తారు.
ఈ సమయంలోనే ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు పోతురాజు మేకపోతును గావు పడతా డు. ఎల్లమ్మ గుడిలోకి చొచ్చుకెళ్లి డప్పుల చప్పుళ్ల మధ్య ఊగుతూ మేకపోతును భు జాలపై వేసుకొని అమ్మ వారు పూనినట్టుగా ఆలయ పరిసరాలన్నీ తిరుగుతూ ఉగ్రరూపంతో, వీరావేశంతో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ మేకపోతును గొంతు కొరికి చంపుతాడు. దీన్నే ’గావు పట్టడం’ అంటారు.
గావు పట్టినప్పుడు కారిన రక్తాన్ని అమ్మ వారికి సమర్పించి, దానిని అక్కడి ప్రజలకు తిలకంగా దిద్దుతాడు. ఈ విధంగా పోతురాజు మేకపోతును బలి ఇచ్చిన తర్వాత ప్రజలు ఆ పోతురాజు చేతిలోని ’ఈరగోల’లతో దెబ్బ లు కొట్టించుకుంటారు.
లందగోలెం, బొడ్రాయికి మొక్కుకొని..
ఆనవాయితీ ప్రకారం పట్టణ ప్రథమ పౌరుడు, ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ ఈ వో కలిసి వేకువజామునే లందగోలెం, బొ డ్రాయికి పసుపు కుంకుమలు అద్ది, మొక్కుకొని జాతర ప్రారంభిస్తారు. ఈసారి మున్సి పల్ చైర్ పర్సన్ పదవీకాలం ముగిసిపోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గానీ ప్రత్యే క అధికారి గానీ మున్సిపల్ కమిషనర్, ఉత్స వ కమిటీ సభ్యులు ఈ తంతును పూర్తి చేయనున్నారు.
ముందుగా గౌడ కులస్తుల నుంచి ఘటాన్ని తీసుకొని ఎల్లమ్మతల్లికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సంప్రదాయం ప్రకారం అమ్మవారికి గౌడ కులస్తులు బాసికాలు కట్టడంతోపాటు అర్చకులు బోనాలు సమర్పి స్తారు. కిన్నెర పంబాలవారు పట్నాలు వేసి, కథ చెబుతారు. వైశాఖ పౌర్ణమి నాడు అమ్మవారికి బాసికాలు కట్టడంతో మొదలై, నెలరో జులపాటు జరిగే జాతర, జ్యేష్టపౌర్ణమి నాడు బాసికాలు విప్పడంతో ముగుస్తుంది.
గంభీరమైన రూపంలో ఎల్లమ్మతల్లి
హుస్నాబాద్రేణుకా ఎల్లమ్మ విగ్రహం 8 అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది. కాకతీయుల కుల దైవమైన యయాతి ఎల్లమ్మకు మారుపేరు అని, అందుకే ఇక్కడ ఎల్ల మ్మ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. బుద్ధుని తల్లి మహామాయా అసలు పేరు రు మ్మిణి దేవి అని, ఆ పేరే కాలక్రమంలో రేణుకా దేవిగా, ఏకవీరా దేవిగా వివిధ రూ పాలు సంతరించుకుందని మరో వాదన ఉంది.
ఈ విషయాన్ని డాక్టర్ ప్రతాప్ చట్సే అనే సనాతన ధర్మ అభ్యాసకుడు తన లో తైన పరిశోధనలో వెల్లడించారు. 10వ శతాబ్దంలో బ్రాహ్మణులు ఆమె ప్రాముఖ్యాన్ని త గ్గించి, అవమానించే ప్రయత్నంలో భాగంగా నే ఆమెను పరశురాముడి తల్లిగా చిత్రీకరించి బ్రాహ్మణీకరించారని ఆయన వాదిస్తు న్నారు. 10వ శతాబ్దం తరువాత, దక్షిణ భా రతదేశంలోని బౌద్ధులు మహామాయాను ఎల్లమ్మ, రేణుక, ఏకవీర, మహురమ్మ, మా తంగి దేవి వంటి అనేక పేర్లతో ఆరాధించడం ప్రారంభించారని ఆయన తన పరిశోధనలో గుర్తించారు.
ఎల్లమ్మ దేవతను ఇక్కడ మావురాల ఎల్లమ్మ అని కూడా పిలవడం గమనా ర్హం. హుస్నాబాద్ ప్రాంతంలో ఎల్లమ్మ పు న్నాన్ని ప్రామాణికంగా తీసుకొని కాలగణన చేస్తారు. బమ్మెర పోతన ఇక్కడి ఎల్లమ్మ ఆల యం వద్ద కూర్చొని రచనలు చేశారని, సర్వా యి పాపన్న ఈ గుడిలో పూజలు చేస్తూ, శత్రువులబారి నుంచి తప్పించుకునేందుకు షెల్టర్ తీసుకునేవాడని చరిత్ర చెబుతారు.
ఇవి బుద్ధుడి పుట్టినరోజు వేడుకలేనా?
బుద్ధుడి పుట్టినరోజును బుద్ధ పూర్ణిమ అనికూడా అంటారు. బుద్ధపూర్ణిమ, వైశాఖి లేదా విశాఖ అనేది వైశాఖ మాస (మే నెల) పౌర్ణమి రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌ ద్ధులందరూ జరుపుకునే పండుగ. ఈ రోజు న బుద్ధుడి జీవిత చరిత్ర, ఆయన బోధనలు చదువుతారు. ఈ సందర్భంగా మండపాలు, స్తంభాలు, దీపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తారు.
హుస్నాబాద్ లో జరిగే ఎల్ల మ్మ జాతర సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు కూడా వీటినే పోలి ఉన్నాయి. ఎల్ల మ్మ పట్నాలు వేసి బైండ్లోళ్లు జమిడిక చప్పుళ్లతో అమ్మవారి చరిత్ర చెబుతారు. బుద్ధుడి జన్మదినాన్ని ఆసియాలోని వివిధ దేశాలలో విభిన్న ఆచారాలతో వేడుకలు చేసుకోవడం లో భాగంగానే హుస్నాబాద్ లో కూడా ఈ పండుగ చేసుకుంటున్నట్టు చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు.
బుద్ధుడి జన్మదినంగా భా వించే క్రీ.పూ. 563 నుంచి బౌద్ధ కాలక్రమం వాడుకలో ఉంది. ఈ ప్రాంతంలో కూడా ఎల్లమ్మపున్నం, బాసింగాలపున్నం నుంచి అని చెప్పుకుంటూ కాలగణన చేస్తారు. ఇది ఈ ప్రాంత విభిన్న సంస్కృతి, అప్పటి బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తోంది.




