calender_icon.png 13 May, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి

11-05-2025 11:40:16 PM

మందమర్రి,(విజయక్రాంతి): ఈనెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ  జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు కోరారు. పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో ఆదివారం నిర్వహించి న యూనియన్ జిల్లా సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించడానికి 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ గా కుదించి కార్మిక కర్షక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందనీ ఆయన కేంద్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు.

సంపాదన సృష్టించే కార్మికులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ విధానాలను వ్యతిరేకిస్తూ మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ను వెంటనే విరమించుకొని  44 చట్టాలను యధాతధంగా అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎండీ అక్బర్ అలీ, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి పౌలు, ముస్కే సమ్మయ్య, కలిందర్ అలీ ఖాన్, తోకల సరస్వతి, దాగం మల్లేష్, సలేంద్ర సత్యనారాయణ, బీమనాధుని సుదర్శన్, దేనబోయిన బాపు, జాడి పోషం, శంకర్ లు పాల్గొన్నారు.