calender_icon.png 13 May, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెర్ఫ్ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్!

12-05-2025 12:00:00 AM

  1. ప్రత్యేక జీవో జారీ చేసిన ప్రభుత్వం 
  2. మార్గదర్శకాల కోసం ఉద్యోగుల నిరీక్షణ
  3. నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం 

సంగారెడ్డి, మే 11(విజయక్రాంతి): సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో అన్ని కేటగిరీల వారు ఉంటారని ఇటీవల ప్రత్యేక జీవో జారీ చేసింది. విధి విధానాలు ఖరారు చేసి త్వరలోనే మరో ఉత్తర్వు జారీ చేస్తామని అందులో స్పష్టం చేసింది.

దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దశాబ్ధానికి పైగా ఒకేచోట పనిచేస్తున్నవారికి స్థానచలనం కలగ నుంది. ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తికానుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

దశాబ్ధంగా తప్పని ఎదురుచూపులు...

జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సెర్ప్,  ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ వంటి రెండు విభాగాల్లో ఉద్యో గులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సెర్ఫ్ పరిధిలో పనిచేసే ఏపీడీలు, డీ పీఎంలు, ఏపీవో పోస్టులకు జోనల్ స్థాయి లో, ఏపీఎంలు, సీసీలకు జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది.

అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిలో ఏపీ వో, ఈసీలు, టీసీ, డీఆర్పీ, డీడీ సీఎల్‌ఆర్సీ, డీబీటీ మేనేజర్, ప్లాన్డ్ సూపర్వైజర్ పోస్టుల కు జోనల్ స్థాయిలో, అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ పో స్టులకు జిల్లా స్థాయిలో బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది.

ఇతర అన్ని ప్రభుత్వ శాఖల్లో మాదిరిగానే మూడేళ్లకోసారి వీరికి కూడా బదిలీలు నిర్వహించాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే ఆయా విభాగాల్లో ఏడేళ్లుగా ఈ ప్రక్రియ నిర్వహించలేదు. దీంతో సదరు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ బదిలీ కోసం నిరీక్షిస్తున్నారు.

 నిరీక్షణకు తెరపడే అవకాశం...

సెర్ఫ్, ఈజీఎస్ ఉద్యోగులకు చివరిసారిగా 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం బదిలీల ప్రక్రియ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వ చ్చాక గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు చేపట్టింది. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆశపడ్డారు. డీఆర్డీఏ అధికారులు కసరత్తు కూడా చేపట్టారు.

అయితే ప్రభుత్వం వారి బదిలీలకు నాడు అవకాశమివ్వలేదు. అప్పటి నుంచి వారు మంత్రి సీతక్కతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు విన్నవిస్తూనే ఉన్నారు. వారి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలు అందిన వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించేలా జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

తద్వారా జిల్లాలో దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేసిన ఉద్యోగులకు స్థానచలనం కలగనుండగా ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశముంది. కొత్తగా ఏర్పడ్డ మండలాల్లోనూ పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ అయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఉపాధి హామీ ఉద్యోగు ల బదిలీల నిర్వహణకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు.

నెలాఖరులోపు పూర్తయ్యే అవకాశం

సెర్ప్ ఉద్యోగుల బదిలీల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టుంది. త్వరలోనే మార్గదర్శకాలను ప్రకటించనుంది.వాటి ఆధారంగా ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. ’ఉపాధి’ ఉద్యో గుల బదిలీలకు సంబంధించి ఇంకా ఎ లాంటి ఉత్తర్వులు రానప్పటికీ వారిని కూడా బదిలీ చేసేందుకు ప్ర భుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందే అవకాశముంది.ప్రభుత్వ ఆదేశాలకనుగు ణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపడుతాం.

గీత, డీఆర్డీవో, 

సంగారెడ్డి