17 March, 2026 | 1:14 AM

మహిళల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసింది

17-03-2026 12:00 AM

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

పాల్గొన్న మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ఘట్ కేసర్, మార్చి 16 (విజయక్రాంతి): కెసిఆర్ సారధ్యంలోని నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి-కల్పనరెడ్డి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొర్రముల వెంకటాద్రి టౌన్ షిప్ లోని చెరుకు బాలయ్య గార్డెన్ లో సోమవారం మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మె ల్యే చామకూర మల్లారెడ్డి తో పాటు, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది మహిళలకు పోచారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బద్దం మమత జగన్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేసిన చీరలను ముఖ్య అతిథులు కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది మహిళలకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి  మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి అమలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక ఆశలు చూపించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసా లను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజల చూపు కేసీఆర్ వైపు మరలిందని, రానున్న రెండేళ్లలో మరోసారి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కెసిఆర్ ముఖ్యమంత్రిగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కౌశిక్ రెడ్డి లు మాట్లాడుతూ సీఎంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అద్భుతమైన పాలన అందించాలని, అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చామకూర భద్ర రెడ్డి, డాక్టర్ ప్రీతి రెడ్డి, మాజీ ఎంపీపీ,  బోడుప్పల్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, పోచారం మున్సిపల్ అధ్యక్షులు మందడి సురేందర్ రెడ్డి, మాజీ మేయర్ లు జక్క వెంకట్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ, ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, పీర్జాదిగూడ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మల, పోచారం మున్సిపల్ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.