calender_icon.png 16 December, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైతిక విజయం బీఆర్‌ఎస్ పార్టీదే

16-12-2025 01:08:30 AM

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ, డిసెంబర్ 15 (విజయ క్రాంతి): కోదాడ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో నైతిక విజయం బీఆర్‌ఎస్  పార్టీదే అని బీఆర్‌ఎస్  పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం ఆయన కోదాడలో సమావేశంలో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో మూడోంతులకు పైగా ఓటమి పాలు అయ్యారని, గెలిచిన వాళ్లలో మా మద్దతుతో గెలిచిన వాళ్ళే అన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురిచేసినా మొక్కవోణి ధైర్యంతో బరిలో నిలిచిన బీఆర్‌ఎస్  అభ్యర్థులకు ఉద్యమాభివందనాలు తెలిపారు.

ప్రజావ్యతిరేక ప్రవాహంలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అవడం ఖాయం అన్నారు. అధికార పార్టీ కనుసన్నళ్ళో పోలీసు యంత్రాంగం పనిచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు అందుకు మునగాల ఎన్నికల ఫలితమే నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, కోదాడ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, కర్ల సుందర్ బాబు, ఉపేందర్, మీసాల శోభా రాణి, కందిబండ సత్యనారాయణ, అభిదర్ నాయుడు పాల్గొన్నారు.