calender_icon.png 21 May, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెక్క తప్పుతోంది..

21-05-2025 12:00:00 AM

  1. మహిళా సంఘాల్లో ఆర్పీల ఇష్టారాజ్యం 
  2. లక్షకు ఇంత అంటూ డబ్బుల డిమాండ్
  3. ఇప్పటికే జిల్లాలో పలువురుపై ఫిర్యాదు 
  4. మహబూబ్ నగర్ జిల్లాలో మూడు మున్సిపాలిటీల పరిధిలో 135 మంది ఆర్పీలు 

మహబూబ్ నగర్ మే 20 (విజయ క్రాంతి) : మెప్మా పరిధిలోని సహాయక సంఘాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.మున్సిపాలిటీల పరిధిలో ఉం డే పొదుపు సహాయక సంఘాల సభ్యుల లె క్కలు పద్దులు చూసేందుకు ప్రభుత్వం ఆర్పీలు ( రిసోర్స్ పర్సన్లు) ఏర్పాటు చేసిం ది.  ఆర్పీలు మహిళా సంఘాల సభ్యులకు లోన్లు అందజేయాల్సి ఉన్నది.

అయితే ఆర్పీ లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. 50వేల రు ణాలు ఇవ్వాల్సిన చోట లక్ష రూపాయల వరకు కూడా ఇ చ్చి తాము ఆ డిందే ఆట పా డింది పాటగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్లో పలువురు ఆర్పి లపై ప్రజావాణిలో ఫిర్యాదులు సైతం చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో 135 మంది ఆర్పీలు ఉన్నారు. ఇలా ఉ మ్మడి పాలమూరు జిల్లాలో 451  మంది పైగా ఆర్పీలు ఉన్నారు.

జడ్చర్ల లో ఆర్పీల ఇష్టారాజ్యం..

పేదరిక నిర్మూలన కార్యక్రమం లో భా గంగా మహిళా సంఘాల కు వడ్డీలేని రుణా లు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన మెప్మ జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వం  భాదేపల్లి లో  23 మంది ఆర్.పి లను నియమించినది. మహిళా సంఘాల కు బ్యాంక్ ల ద్వారా రుణాలు ఇప్పించేపనికి ఈ సదరు ఆ ర్.పి లు లోన్లు ఇప్పించి లంచవతారం ఎత్తుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నా యి.

నిరుపేదలైన మహిళలు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకుని ఆర్.పి ల ద్వా రా రుణాలు మంజూరు చేయాలని వాళ్ల ఇండ్ల చుట్టూ తిరుగుతూ ఉంటే లక్షకు రూ.2 నుంచి 5000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలా కాకుండా మొత్తం గా  కో టి రూపాయల లోన్ కు ఒక రేట్ ఫిక్స్ చేసి డబ్బు వసూలు చేస్తున్నట్లు మహి ళా సభ్యులు ఆరోపిస్తున్నారు. మహిళా సాధికారత కో సం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెప్మా ఉద్దే శం నీరుగారిపోయింది.

ఆర్. పి లకు నెల కు6000 జీతం తోపాటు 1500 గౌరవ వేతనంగా మహిళా సంఘాల నుండి తీసుంటూనే ఇలా చేయడంపై మహి ళా సంఘాల సభ్యులు దుమ్మెత్తి పోస్తున్నారు. కోట్ల రూపాయల మహిళా సంఘా లకు ఇప్పించే రుణాల కోసం లంచాలు లాగుతున్నారు.

ఇదే విషయమై ఆర్పీలపై టౌన్ కోఆర్డినేటర్లు జిల్లా కో ఆర్డినేటర్లకు ఫిర్యాదు చేసిన ఫలితం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం మారినా ఈ ఆర్‌పిలపని తీరు మారడం లేద ని మహిళా పొదుపు సంఘాలు మండి పడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అడ్డదారులు తొక్కుతున్న ఆర్పీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.