calender_icon.png 8 December, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల హక్కులను కాపాడుకోవాలి

08-12-2025 01:33:47 AM

-కార్పొరేట్ శక్తులకు మోదీ సర్కార్ ఊడిగం

-లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా కేటీఆర్ కలిసివస్తే స్వాగతిస్తాం

-ప్రైవేట్ ఎయిర్ వే కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి

-సీఐటీయూ పూర్వ ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు

-మెదక్‌లో అట్టహాసంగా సీఐటీయూ మహాసభలు ప్రారంభం

మెదక్, డిసెంబర్ 7(విజయక్రాంతి): దేశంలో ఆదానీ, అంబానీ ఆస్తులు పెరుగుతున్నాయని, కార్మికుల జీతాలు మాత్రం పెరగడం లేదని సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని అ న్నారు.

ఆదివారం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలు మెదక్ పట్టణంలో అట్టహాసం గా ప్రారంభమయ్యాయి. మహాసభల సందర్బంగా కార్మికులు మెదక్ లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి చిల్డ్రన్స్ పార్క్ వరకు ఎర్ర జెండాలు పట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు.

చిల్డ్రన్స్ పార్క్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ఉంటే విమాన సర్వీసులు తక్కువ రేట్లు ఉండేవని దాన్ని టాటాకు అమ్మడం వల్ల ప్రైవేట్ ఎయిర్ వే కంపెనీలు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఇండిగో విమానాలు నిలిచిన నేపథ్యంలో విమానాల టికెట్ల చార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజలను దోచుకుంటున్నార ని ఆరోపించారు.

కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యానికి ఇది నిదర్శనమన్నారు. ఎయిర్ ఇండియా ప్రభుత్వ ఆధీనంలో ఉండి ఉంటే చౌకగా విమాన చార్జీలు ఉండేవన్నారు.పాలకులు ఆశలు, అంగన్వాడీ కార్యకర్తలచే వెట్టి చాకిరి చేయిస్తున్నారని రాఘవులు ఆరోపించారు. కార్మికులు హక్కులను కాపాడుకోవల సిన సమయం వచ్చిందని, రాబోయే కాలం లో కార్మిక సంఘాలు ఐక్యతతో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 

కేటీఆర్ కలిసివస్తే స్వాగతిస్తాం

కేటీఆర్ నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా సమ్మె చేస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, తెలంగాణ రాష్ట్రంలో పదేండ్లు మీ పార్టీ అధికారంలో ఉంది ... అప్పుడు ఎందుకు మాట్లాడలేరని రాఘవులు ప్రశ్నించారు. నిజాయితీగా కలిసి రండి..మోసపూరితంగా రాకండని కేటీఆర్ కు హితవు పలికారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే లేబర్ కోడ్ లు తెలంగాణ రాష్టంలో అమలు చేయాలని, శాసనసభలో బిల్లు పెట్టీ కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటీయూ జాతీయ అధ్యక్షులు హేమలత, జాతీయ కోశాధికారి సాయిబాబ, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, రాష్ట్ర నాయకులు వీరయ్య, రమ, రాములు, మల్లికార్జున్, బాలమణి, ఏ.మల్లేశం, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.