02-06-2025 02:22:27 AM
ఘటన స్థలాన్ని పరిశీలించిన జూపల్లి అరుణ్
పెద్దకొత్తపల్లి జూన్ 01 :పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత పగడాల చిన్నయ్య ప్రయాణిస్తున్న కారు ఆదివారం అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని సంజీవపూర్ గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తమ కుటుంబ సభ్యులను హైదరాబాద్ లో విడిచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడినవెంటనే స్థానికులు గమనించి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. ఘటనస్థలి వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు జూపల్లి అరుణ్ సందర్శించి ఆయనను పరామర్శించారు.