16 April, 2026 | 1:05 PM

3 నుంచి భూభారతి సదస్సులు

02-06-2025 02:24 AM

రేవల్లి జూన్ 1 : మండలంలోని వివిధ  గ్రామాలలో భూభారతి రెవిన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు తాసిల్దార్ లక్ష్మీదేవి ఆదివారం ఒక ప్రకటన తెలిపారు, ఈ నెల 3 మరియు 4వ తేదీలలో కేశంపేటలో,5, 6 మరియు 9 లలో రేవల్లి,10,11,12 న తలుపునూరు,13 కొంకలపల్లి,16,17,18 నాగపూర్,19 శానాయిపల్లి,20 తేదీలలో బండారపాకుల  నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

ఆ గ్రామాల్లోని వ్యవసాయ పొలాల సమస్యలున్న రైతులు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టములో సునాయాసంగా పరిష్కరించు కోవచ్చని ఆమె తెలిపారు.