17 April, 2026 | 11:43 AM

Breaking News

ఈనెల 30 వరకు పోలీస్ యాక్టు అమలు

02-06-2025 02:19 AM
  1. నిరసనలు ఆందోళన చేయొద్దు 

నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు : జిల్లా ఎస్పీ డి జానకి

మహబూబ్ నగర్ జూన్ 1 (విజయ క్రాంతి) : జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకుఈనెల 1వ తేదీ న నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 30 పోలీస్‌ఆక్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు చేయకూడదని తెలిపారు.

నిషేదిత ఆయుధములు అయిన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దొడ్డుకర్రలు, తుపాకులు ప్రేలుడు పదార్థములు, నేరమునకు పురిగొల్పే ఎటువంటి ఆయుధములను వాడరాదన్నారు. ప్రజలకు ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను జనసమూహం ప్రోగు అవుట వంటివి నిషేధించడం జరిగిందని పేర్కొన్నారు. రాళ్ళను జమ చేయుట,

ధరించి సంచరించుట వంటివి నిషేధమని, లౌడ్ స్పీకర్ లు, డీజే లు వంటివి కూడా ఈ సమయంలో నిషేధము. నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన 30 పోలీస్ ఆక్ట్ 1861 కింద శిక్షఅర్హులు అవుతారని ఎస్పి పేర్కొన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని తెలియజేశారు. శాంతి భద్రతల విషయంలో మరింత కఠిన వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. 

18 మంది అధికారులకు పతకాలు 

మహబూబ్ నగర్ జిల్లా లోని 18  మంది పోలీసు అధికారులకు, సిబ్బందికి పోలీసు సేవా పతకాలు లభించినట్లు జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంసందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ రకాల పోలీసు పతకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.  జిల్లా నుండి పతకాలు పొందిన పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ డి.జానకి  అభినందనలు తెలిపారు.