calender_icon.png 6 September, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదవాడి సొంతింటి కలలు సాకారం చేస్తున్న కేంద్రం

06-09-2025 12:00:00 AM

  1. కేంద్ర ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వతో భాగస్వామ్యంతో గిరిజనులకు ఇళ్ల మంజూరు
  2. లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను అందజేసిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్

అదిలాబాద్, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి):  దేశంలో ఇల్లు లేని వారెవ్వ రూ ఉండవద్దనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదవాడి సొంతిల్లు కలలు సహకారం చేస్తుందని ఎంపీ గోడం నగేష్, ఎమ్మె ల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానమంత్రి జన్ మన్ యోజన పథకం కింద ఇళ్ల మంజూరైన లబ్ధిదారులకు కలెక్టర్ రాజర్షి షా తో కలిసి మంజూరు పత్రాలు పంపి ణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెనుకబడిన గిరిజనులకు ఇళ్ల మంజూరు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ మన్ యోజన కింద ఈ ఇళ్ల మంజూరుతో పేద ప్రజలకు భరోస కలిగింద న్నారు. ఇండ్ల నిర్మాణం లో సగభాగం కేంద్ర ప్రభుత్వం సగభాగం రాష్ర్ట ప్రభుత్వం నిధులు భరించి పేదలకు ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.