calender_icon.png 21 January, 2026 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీటింగ్‌కు రాలేదని సీఈవో ఆగ్రహం

19-11-2024 12:00:00 AM

99 మంది తొలగింపు

న్యూయార్క్: అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్ కంపెనీ సీఈవో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని ఉద్యోగులను తొలగించారు.ఒకేసారి 99 మందిపై వేటు వేశారు. మొత్తం ఆ సంస్థలో 111 మంది విధులు నిర్వర్తిస్తుండగా.. ఆ భారీ తొలగింపు చోటుచేసుకుంది.

ఆ సంస్థలో పనిచేస్తోన్న ఓ ఇంటర్న్ (కార్యకలాపాలు నిర్వహించే తాత్కాలిక ఉద్యోగి) పెట్టిన పోస్టుతో ఈ విషయం వైరల్‌గా మారింది. సందేశాలను బట్టి చూస్తే ఆ మ్యూజిక్ సంస్థ సీఈవో పేరు బాల్డ్విన్. జాబ్‌ను సీరియస్‌గా తీసుకోలేదని తొలగింపునకు గురైన ఉద్యోగులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 

కాగా, సీఈవో తీరుపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  మొత్తంగా ఈ వ్యవహారమంతా వింతగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.