19-11-2024 12:00:00 AM
హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగింది. సోమవారం పసిడి రేట్లు సుమారుగా రూ.౬౦౦ పెరిగింది. దీంతో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం తిరిగి రూ. 70 వేల మార్కును దాటింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం 22 క్యారెట్ల బంగారం తులం (10గ్రాములు) ధర రూ. 600 పెరిగి రూ. 69,950 లకు చేరింది.
ఇక 24 క్యారెట్ల బంగారం రూ.660 ఎగసి రూ. 76,310 వద్దకు హెచ్చింది. తెలు గు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ బంగారం ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.600 పెరిగి రూ.70,100 వద్దకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.660 ఎగిసి రూ.76,460 వద్దకు చేరింది.
అయితే వెండి ధరలు వరుసగా నాలుగో రోజూ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లోప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.