calender_icon.png 21 August, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావోద్వేగాల చాయ్‌వాలా

21-08-2025 12:00:00 AM

శివ కందుకూ రి హీరోగా, తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘చాయ్‌వాలా’. ప్రమోద్ హ ర్ష రచనాదర్శకత్వం వ హించారు. రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్ పాపుడిప్పు నిర్మిస్తున్నారు. బుధవారం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ ఇది’ అన్నారు.

శివ కందుకూరి మాట్లాడుతూ.. “ఈ చిత్రాన్ని చూసి వచ్చిన తర్వాత తండ్రితో కాసేపు మాట్లాడతారని కచ్చితంగా చెప్పగలను. రాజీవ్ కనకాలతో పనిచేసిన క్షణాల్ని నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. ఆయన్నుంచి ఎంతో నే ర్చుకున్నా” అని చెప్పారు. తేజు అశ్విని మాట్లాడు తూ.. “తెలుగు లో నాకు ‘చాయ్ వాలా’ మొదటి చిత్రం. ఇది అందరికీ నచ్చుతుంది” అని చెప్పింది. ‘ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటనలే మా చిత్రం.

ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందీ సినిమా’ అని చిత్ర దర్శకుడు ప్రమోద్ హర్ష తెలిపారు. నిర్మాత వెంకట్ ఆర్ పాపుడిప్పు మాట్లాడుతూ.. “ఈ మూవీలోని కొన్ని సీన్లను ఆల్రెడీ చూశాను. నా కంట్లోంచి నీళ్లు వచ్చాయి. ఇదొక సెన్సిబుల్ లవ్ స్టోరీ” అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు రాజీవ్ కనకాల, రాజ్‌కుమార్ కసిరెడ్డి పాల్గొన్నారు.