calender_icon.png 21 August, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరోయిన్లనే ఇబ్బందిపెడతారు

21-08-2025 12:00:00 AM

ఇబ్బందికరమైన ప్రశ్నలను హీరోయిన్లనే అడుగుతారని, వ్యూస్ కోసం మగవారిని అలాంటి ప్రశ్నలు ఎందుకు అడగరో తనకు అర్థం కాదంటూ నిట్టూర్చింది అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. “సోషల్‌మీడియా కామెంట్స్‌ను పట్టించుకోను. నేను పరదా పోస్టర్లను షేర్ చేసినప్పుడు ‘అట్టర్ ఫ్లాప్ అవుతుంది’ అంటూ నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. ఈ కామెం ట్స్ మా సినిమాను నిర్ణయించలేవు. నిజంగా సినిమా ప్రేక్షకాదరణ పొందకున్నా బాధపడను.

మంచి సినిమా తీశానన్న సంతృప్తి నాకు జీవితాంతం ఉంటుంది. మొదట్లో ఇలాంటి కామెంట్స్ విని చాలా బాధపడేదాన్ని. అనుభవం వచ్చే కొద్దీ ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలనిపిస్తాయి. ‘టిల్లు స్కేర్’ తర్వాత నేను మాట్లాడే విధానంలోనూ మార్పు వచ్చింది. ఆ సినిమా రిలీజ్ టైమ్‌లో నాపై చాలా నెగెటివిటీ వచ్చింది.

రిలీజ్ తర్వాత ప్రశంసించారు. నెగెటివిటీ వస్తుందని తెలిసే సిద్ధమయ్యా. అలాంటి రోల్స్‌ను ఒప్పుకోవడమే సవాల్.. వాటిని ఓకే చేసేం దుకు ధైర్యం కావాలి. ఆ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో ఎన్నో ఇబ్బందికర ప్రశ్నలడిగారు. అవి ప్రశ్నలు మహిళల్నే అడుగుతారు. హీరోలను ఎందుకు అడగరు? వ్యూస్ రావడం కోసమే అలా ఇబ్బందిపెడతారు. వాటికి సమాధానం చెప్పలేకపోయా” అని తెలిపింది.