calender_icon.png 22 August, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేటకు కదిలే ఘాటి..

21-08-2025 12:00:00 AM

‘తూరుపు కనుమల నడుమింటి.. కారడవుల్లో కాలెట్టి.. చిరుతై ఉరికే యమజట్టి.. వేటకు కదిలే ఘాటీ..’ అంటూ సాగే పాట ఘాటి తెగవారి జీవన శైలిని, వారి సంస్కృతిని ఆవిష్కరింపజేస్తోంది. ‘ఘాటి’ చిత్రం నుంచి విడుదలైన రెండో గీతం ‘దస్సోరా’లోని పంక్తులివి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామానే ‘ఘాటి’.

విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ బుధవారం సెకండ్ సింగిల్ ‘దస్సోరా’ను విడుదల చేశారు. సాగర్ నాగవెల్లి స్వరపర్చిన ఈ గీతానికి ఈఎస్ మూర్తి సాహిత్యం అందించగా గీతా మాధురి, సాకేత్, శ్రుతి రంజనీ ఆలపించారు. ఈ పాటలో కథానాయకి అనుష్క, విక్రమ్ ప్రభు, ఇంకో ఘాటీల టీమ్ సరుకును సీక్రెట్‌గా ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ, పోలీసుల్ని తప్పించుకుంటున్న సన్నివేశాల్ని చూపించారు.

చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్; కథ: చంటకింది శ్రీనివాసరావు; మాటలు: సాయిమాధవ్ బుర్రా; డీవోపీ: మనోజ్‌రెడ్డి కాటసాని; సమర్పణ: యూవీ క్రియేషన్స్; బ్యానర్: ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్; ఆర్ట్: తోట తరణి; ఎడిటర్: చాణక్యరెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి; యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్‌కృష్ణ; నిర్మాతలు: రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి; రచనాదర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి.