calender_icon.png 12 January, 2026 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధి పేదలకు వరం

12-01-2026 12:38:16 AM

 జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి11:   సీఎం సహాయనిది పేదలకు వరం లాంటిదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,నర్సింగ శ్రీనివాస్‌గౌడ్‌లు అన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు దరూరి యోగానంద చార్యుల సహకారంతో ప్రభుత్వం నుండి మంజూరు అయిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మండల పరిధిలోని రామన్నగూడెం, చాకలి గూడెం గ్రామాలకు చెందిన పులకరం ఫాతిమాకు రూ.60వేలు, అక్కెనపల్లి జానయ్యకు రూ.24,500 లను బాధితులకు అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలనలో పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అర్హులంతా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తదనంతరం జాజిరెడ్డిగూడెం గ్రామంలో వీధి లైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వల్లాల ఖాజా, దేవస్థానం డైరెక్టర్ సోమయ్య,వార్డు సభ్యులు సైదులు, యాదగిరి, ప్రవీణ్, నరేష్ నాయకులు కొమురెల్లి, సత్తయ్య, మల్లేష్, విజయ్  ఉన్నారు.