calender_icon.png 12 January, 2026 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ

12-01-2026 12:39:48 AM

ఆలేరు, జనవరి 11  (విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణం ప్రభుత్వ విప్ కార్యలయంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య  సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు, ఆలేరు నియోజకవర్గం లోని ఎనిమిది మండలాలకు సంబంధించిన సుమారు 200 మంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుమారు 100 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ వంటి పథకాల ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వ పథకాలు పేద, కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కీలకంగా పనిచేస్తున్నాయని, ముఖ్యమంత్రి సహాయ నిధి  ద్వారా అందుతున్న ఆర్థిక సాయం వల్ల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వేధింపులు తగ్గుతున్నాయని గుర్తుచేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు స్వీకరించే యువతులకు ఇది పెళ్లిళ్ల ఖర్చులు, కుటుంబ పరిరక్షణకు చాలా ఉపకారపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.