04-12-2025 05:36:27 PM
నిర్మల్ (విజయక్రాంతి): హిందూ దేవతలను దూషిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన గంగోని శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో 50 మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు పాదయాత్రగా బయలుదేరారు. ప్రస్తుతం ఈ బృందం తమిళనాడు రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలను అవమానపరిచేలా మాట్లాడటం బాధాకరంగా ఉందని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోని హిందూ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.