04-12-2025 05:40:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): శ్రీ సరస్వతి శిశుమందిర్ బుధవార్పేట్ పాఠశాలలో జాతీయ నావికా దళ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చారు. విద్యార్థులు నౌకాదళ వేషాధరణాలు ప్రదర్శించారు. భారతీయ నావికా దళానికి సెల్యూట్ చేస్తూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు ఇచ్చారు. తదనంతరం పాఠశాల ప్రధానాచార్యులు కొండూరు నరేష్ మాట్లాడుతూ దేశానికి నావికాదళం సేవలు ఘనీయమని తెలియజేశారు. భారత నావికాదళ పితామహుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించినందుకు ఈ కార్యక్రమంలో ఆచార్యులు విద్యార్థులు ఆపరేషన్ ఫ్రైడ్ అండ్ స్మరించుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు విద్యార్థులు, ప్రధానాచార్యులు కొండూరు నరేష్ పాల్గొన్నారు.