calender_icon.png 1 November, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను వదిలేసి పెళ్లికెళ్లిన సీఎం

01-11-2025 12:00:00 AM

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): భారీవర్షాలకు నష్ట పోయిన రైతులను సీఎం రేవంత్ రెడ్డి  పట్టించుకోకుండా మహారాష్ర్ట కాంగ్రెస్ నేత షిండే మనవరాలి పెళ్లి కోసం ముంబైకి వెళ్లారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వరిపంట ఎకరానికి రూ.30వేలచొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, మృతుల బాధిత కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లో కూడా అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సరేనని, ఎంఐఎంతో మ్యాచ్ ఫిక్సింగ్, ఓవైసీ ఆశీస్సులతోనే ఆయనకు మంత్రి పదవి వచ్చిందని ఆరోపించారు.