calender_icon.png 1 November, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియాలో 65% బొగ్గు ఉత్పత్తి

31-10-2025 11:53:08 PM

ఏరియా జిఎం రాధాకృష్ణ

మందమర్రి,(విజయక్రాంతి): ఏరియాలో అక్టోబర్ మాసానికి గాను నిర్దేశించిన లక్ష్యానికి 65% బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్  రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం జిఎం కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. కేకే 5 గనిలో  20వేల టన్నులకు గాను 17242 టన్నులు 86%, కాసిపేట గనిలో 19 వేల టన్నులకు గాను 12458 టన్నులు 66%, కాసిపేట 2 గనిలో 16 వేల టన్నులకు గాను 12495 టన్నులు 78%, శాంతిఖనిలో 10వేల టన్నుల గాను 6841 టన్నులు 68%, కేకే ఓసీపి లో 1.8 లక్షల టన్నులకు గాను 1.9 లక్షల టన్నులు 61% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందన్నారు. భూగర్భగనులు కార్మికుల గైర్హాజర్ మూలంగా ఆశించిన బొగ్గు ఉత్పత్తి సాధించడం లేదని, రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన కోసం  అధికారులు, సూపర్వైజర్లు సమిష్టిగా కృషి చేయాల న్నారు. ఈ సమావేశంలో  ఏరియా పియం శ్యాంసుందర్, ఐఈడి కిరణ్, లు పాల్గొన్నారు