నా ప్రొటోకాల్ సీఎం చూసుకుంటడు..
* ఓడిపోయినా.. నిధులు నేనే తెస్తున్న
* పల్లా.. సిగ్గుంటే రాజీనామా చెయ్
* జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
జనగామ, డిసెంబర్ 7 (విజయక్రాంతి): జనగామాలో తాను ఓడిపోయినా ఈ ప్రాంత అభివృద్ధికి జీవోలు విడుదల చేయించి నిధులు తెస్తున్నది తానేనని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. దొంగ ఓట్లతో గెలిచిన పల్లా ఒక్క రూపాయి కూడా తేలేదని మండిపడ్డారు. ఆయనకు సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలను పురస్కరించుకుని శని వారం జనగామ ఆర్టీసీ చౌరస్తాలో మేడ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
తనకు ప్రొటోకాల్ లేదంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కిరికిరి చేస్తున్నారని విమ ర్శించారు. తన మెడికల్ కాలేజీ రెన్యూవల్ కోసం ఉచిత వైద్యం పేరుతో జనగామ ప్రజలను అక్కడికి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని పల్లాకు సవాల్ చేశారు.
కొమ్మూరికి కార్పొరేషన్ పదవి
జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి స్థానికంగా ప్రొటోకాల్ సమస్య లేకుండా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిం చేందుకు కృషి చేస్తానని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. బీఆర్‌ఎ స్ హయాంలో జనగామ జిల్లాలోని ప్రాజె క్టుల నుంచి సిద్దిపేటకు మాజీ మంత్రి హరీశ్ రావు నీళ్లు తరలించుకుపోయారన్నారు. అయినా ఇక్కడ ఆ పార్టీ నేతను గెలిపించడం బాధాకరమన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జనగామ ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, టీపీసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి అరుణ, కాంగ్రెస్ నేతలు చెంచా రపు శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ రాజమౌళి, లక్ష్మీ నారాయణనాయక్, జక్కుల అనితవేణు మాధవ్ పాల్గొన్నారు.




