03-01-2026 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల, జనవరి 2 (విజయక్రాంతి): చలికాలంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కరీంనగర్ మెడికవర్ వైద్యులు తెలిపారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో చలికాలంలో వచ్చే వివిధ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చలితో రక్తం చిక్కగా మారడం, రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల గుండెపై,మెదడుపై ఒత్తిడి పెరిగి హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని వివరించారు.
చలికాలంలో ఆల్కహాల్ సేవించడం, తక్కువగా నీళ్లు తాగడం కూడా ప్రమాదకరమని, షుగర్, బీపీ స్థాయులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైరిస్ పేషెంట్లలో చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా నంజులాగా తయారై ప్రాణాపాయ స్థితిలోకి వెల్లే ప్రమాదముందన్నారు. స్వంత వైద్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించి మందులు వాడాలన్నారు. ఎలాంటి ఎమర్జెన్సీ వ్యాధులకైనా మొదటి గంట గోల్డెన్ అవర్ అని ఆ సమయంలో ఆసుపత్రికి తీసుకువస్తే రిస్క్ తక్కువగా ఉండి ప్రాణాలు కాపాడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు.
మెడికవర్ ఆసుపత్రి లో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కేసులకు చికిత్స అందించేందుకు అర్హత కలిగి 24 గంటల పాటు పనిచేసే 45 మంది వైద్యులు, క్రిటికల్ కేర్ వైద్యులతో కూడిన 5 ఐసీయూలు, ఎమర్జెన్సీ టీం కలిగిన ప్రత్యేక ఎమర్జెన్సీ విభాగం, 30 మంది కన్సల్టెంట్లు, డయాలసిస్, సిటీస్కాన్, ఎంఆర్‌ఐ వంటి సదుపా యాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
మెడికవర్ ఆసుపత్రి సెంట ర్ హెడ్ గుర్రం కిరణ్ ఆద్వర్యంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో కార్డియాలజిస్టు డాక్టర్ అనీష్పబ్బ, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపెందర్రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు, ఎమర్జెన్సీ ఫిజీషియన్ డాక్టర్ సత్యనారాయణ, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, లక్ష్మిరాజం తదితరులు పాల్గొన్నారు.