calender_icon.png 20 December, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రథయాత్రకు స్వాగతం పలికిన కలెక్టర్

20-12-2025 12:00:00 AM

మహబూబాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ధర్మ ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మొట్టమొదటిసారిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు విచ్చేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ధర్మ ప్రచార రథానికి ఐ.డి.ఓ.సి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వాగతం పలికి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. రథం ముందు కొబ్బరికాయ కొట్టి ధర్మ ప్రచారాన్ని ప్రారంభించారు.

శనివారం  జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ రామాలయంలో నిర్వహించే శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి రథం మొట్ట మొదటి సారి భూపాలపల్లి జిల్లాకు రావడం సంతోషకరమన్నారు. ధర్మ ప్రచారం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీవో రవి, కార్యాలయ ఏ.వో మురళీధర్ రావు, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.