07-08-2025 09:34:07 PM
నంగునూరు: సిద్దిపేట జిల్లా(Siddipet District) నంగునూరు మండలం అక్కెనపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రిన్సిపాల్ మంద జానయ్య మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ దశ విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమన్నారు. కళాశాలలో అనుభవం, అంకితభావం ఉన్న అధ్యాపకులు ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమని, వినయం లేని విద్య పరిమళం లేని పువ్వు లాంటిదని ఉపాధ్యాయ బృందం కొనియాడారు. అనంతరం విద్యార్థులు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు.