23 June, 2026 | 1:34 AM

కంపెనీ అభివృద్ధే కార్మికుల ధ్యేయం

23-06-2026 12:00 AM

- ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

తూప్రాన్, జూన్ 22 : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం, బ్రాహ్మణపల్లి లోని టాటా కన్జ్యూమర్ ప్రొడకట్స్ లిమిటెడ్ (టీసీపిఎల్) కంపెనీ కార్మిక సంఘం నూతన అధ్యక్షుడిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సోమవారం టీసిపీఎల్ ఎంప్లాయిస్ యూనియన్, మేనేజ్మెంట్ ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే, టీసీపిఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి కంపెనీ గెట్ ముందు బీఎంఎస్ జెండాను ఆవిష్కరించి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబంలో భార్యాభర్తలు పరస్పర సహకారంతో ముందుకు సాగినట్లే కంపెనీ యాజమాన్యం, కార్మికులు కూడా ఐక్యంగా పనిచేస్తే సంస్థ అభివృద్ధి చెందడంతో పాటు కార్మికుల జీవితాలు మెరుగుపడతాయని అన్నారు. కంపెనీ బాగుంటేనే కార్మికుల సంక్షేమం సాధ్య మవుతుందని, చిన్న చిన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీసీపిఎల్ సైట్ హెడ్ శివకుమార్, హెచ్.అర్ హెచ్.అర్ కోటేశ్వర రావు, క్వాలిటీ ఆఫీసర్ రాకేష్, ప్రొడక్షన్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, మెయింటెనెన్స్ ఇన్చార్జి రంగనాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎం. గిరీష్ రెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జి వర్గంటి రామ్మోహన్ గౌడ్, బిజెపి పట్టణ అధ్యక్షులు భూమన్నగారి జానకిరామ్ గౌడ్, మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య ముదిరాజ్, పడాలపల్లి కౌన్సిలర్ సత్యనారాయణ, సంఖ్య యాదగిరి, రఘువీరారెడ్డి, వెంకట నాగేంద్ర గౌడ్, జక్కిడి నరేందర్ రెడ్డి (బుల్లెట్ రాజు), టాటా కంజుమర్ ప్రొడక్ట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ లంబ లవకుమార్ యాదవ్, జాయింట్ సెక్రెటరీ బొంది శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జి. నర్సింగ్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వి. రఘుపతి రెడ్డి, టి. వీరప్రసన్న, ట్రెజరర్ బి. వెంకట్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పి. ప్రవీణ్, జి. సత్య నారాయణ, వైస్ ప్రెసిడెంట్లు కే. దైవాదీనం, ఎల్. మహేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎం. రామశర్మ, కార్మిక నాయకులు, మహిళా కార్మికులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.