16-10-2025 06:38:12 PM
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర..
కరీంనగర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తున్న గ్రామ పాలనను గాడిలో పెట్టే ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమని, రెండేళ్ల కాలంగా గ్రామ పరిపాలన వ్యవస్థ సక్రమంగా లేక నేడు గ్రామాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు. గురువారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామన్న కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే, ఇప్పట్లో లోకల్ ఎలక్షన్స్ నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదనేది స్పష్టంగా అర్థమవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గందరగోళ పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది అని విమర్శించారు.