16-10-2025 06:35:39 PM
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాజెక్టు అంగన్వాడీ యూనియన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. బుధవారం మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో 4 మండలాలకు సంబంధించి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ యూనియన్ మరిపెడ ప్రాజెక్టు అధ్యక్షురాలిగా లలిత, కార్యదర్శిగా జ్యోతి, కోశాధికారిగా మూల జ్యోతి, ఉపాధ్యక్షురాలుగా ఉమా, సహాయ కార్యదర్శిగా మంజుల, గౌరవ అధ్యక్షురాలుగా లీలాబాయి, సలహాదారుగా కలమ్మ, పుష్ప, సోషల్ మీడియా కన్వీనర్గా కవిత, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.