25-10-2025 12:21:13 AM
లింగ నిర్ధారణ చేస్తే 3 ఏండ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వి.వాణిశ్రీ
పెద్దపల్లి అక్టోబర్ 24 (విజయ క్రాంతి) జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలలో ‘లింగ నిర్ధారణ చేయడం నేరమని, లింగ నిర్ధారణ చేస్తే 3 ఏండ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించబడుననిజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వి.వాణిశ్రీ తెలిపారు. పెద్దపెల్లి పట్టణంలో శుక్రవారం స్కానింగ్ సెంటర్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. డా. ప్రసాద్ మెమోరియల్ లీలావతి నర్సింగ్ హోమ్, శ్రీదేవీ హాస్పిటల్, రమ హాస్పిటల్ లో స్కానింగ్ కేంద్రాల ను పరిశీలించారు.
రిజిస్టర్డ్ గైనకాలజిస్ట్ యే స్కాన్ లు చేస్తున్నారా, గర్భిణీ లకు స్కాన్ చేసిన వివరాలు రికారడ్స్, ఫారం ఎఫ్ యందు సరిగా నమోదు చేయుచున్నారా లేదా అని పరిశీలించారు. స్కానింగ్ కేంద్రాలలో ‘లింగ నిర్ధారణ చేయబడదని, ఇక్కడ ఆడ మగ అని చెప్ప బడదు‘ అని బోర్డ్ లు ఏర్పాటు చేయాలన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడ పిల్లలు తక్కువగా పుడుతున్నారని, లింగ నిర్ధారణ ద్వారా గర్భస్థ శిశువు ఆడ పిల్ల అని తెలుసుకొనే ప్రయత్నం చేయ కూడదని, అది చట్ట ప్రకారం నేరం అని అన్నారు.
లింగ నిర్ధారణ చేసిన వారికి, అడిగిన వారికి చట్ట ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్ష రూ. 10 వేల రూపాయలు జరిమానా విధించ బడునని అన్నారు. పుట్ట బోయే పిల్లలు ఆడ అయినా మగ అయిన సమానమే అని అన్నారు. ఆడ వారు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, సంతానం లేని వారి సంఖ్య ఒక వైపు పెరుగుతూ ఉంటే, ఆడ పిల్లలు వద్దు అనుకోవడం మహా పాపం అని అన్నారు. ఎక్కడి స్కాన్ కేంద్రంలో నైనా లింగ నిర్ధారణ చేసినట్టు రుజువు అయితే కఠినమైన శిక్ష పడుతుందని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో వెంట వైద్య అధికారీ డా. లక్ష్మీ భవానీ, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ఎస్.వెంకటే శ్వర్లు పాల్గొన్నారు.