calender_icon.png 1 October, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాకీ కార్డే కాంగ్రెస్‌కు ఉరితాడు

01-10-2025 01:25:31 AM

  1. స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బ్రహ్మాస్త్రం
  2. గ్యారెంటీల హామీలన్నీ మోసమే 
  3. ప్రతి ఇంటికీ కాంగ్రెస్ బాకీ కార్డు ఇచ్చి ప్రభుత్వ ద్రోహాన్ని ప్రజలకు తెలియజేస్తాం
  4. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు 

సిద్దిపేట, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ హామీలన్నీ మోసాలేనని, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో కాంగ్రెస్ మోసాల చర్చ జరగేలా కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తామని.. ఈ బాకీ కార్టే కాంగ్రెస్‌కు ఉరితాడు అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ పాలనలో చేసిన మేలును, కాంగ్రెస్ పాలనలో చేసిన ద్రోహాన్ని ప్రజలకు తెలియజే స్తామని చెప్పారు.

బాకీ కార్డు స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుం దని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును హరీశ్ రావు విడుదల చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకి రూ.75 వేల రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి మహి ళకు రూ.44 వేలు బాకీ పడిందన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ ఎంత బాకీ పడిందో ఈ కార్డు ద్వారా తెలియజేస్తామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ పాలనలో అబద్ధపు హామీలు మాత్రమే ఇచ్చారని, ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఎండగట్టారు. రైతుబంధు మొత్తాన్ని కూడా ఎగ్గొట్టారని, కౌలు రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శిం చారు. కరోనాలో కూడా కేసీఆర్ రైతుబంధు ఆపలేదు. కానీ కాంగ్రెస్ పాలనలో రైతు బంధు డబ్బులు ఎక్కడికో మాయమయ్యాయని ఆరోపించారు. రాహుల్‌గాంధీ, ప్రి యాంకగాంధీ, రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు గాలిలో కలిశాయని ఎద్దేవా చేశారు.

100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 700 రోజులు అయినా ఒక్క హామీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తొమ్మి దేళ్లలో రూ.20 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తే, కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు ఇవ్వలేదని విమర్శించారు. సగం కాలేజీలు మూతపడ్డాయని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ దద్దమ్మత నానికి నిదర్శనమని మండిపడ్డారు. కాం గ్రెస్ రూ.4వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని ప్రియాం క గాంధీ హుస్నాబాద్‌లో చెప్పి మోసం చేసిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ జాబ్‌లెస్ క్యాలెండర్ అయిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఊరూరా బెల్టు షాపులు, మైక్రో బ్రూవరీలు పెట్టి తాగుబోతుల తెలంగాణ చేస్తున్నాడని విరుచుకుపడ్డారు.

గ్యారంటీలకు టాటా చెప్పి లంక బిందెలకు వేట పెట్టాడని మండిపడ్డారు. ఈ సమావేశంలో సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.