27-11-2025 12:18:14 AM
అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా
హుజూర్ నగర్, నవంబర్ 26: ప్రపంచ దేశాలలోని అన్ని రాజ్యాంగాలలో కెల్లా భార త రాజ్యాంగం సుదీర్ఘమైనదని, అత్యున్నతమైనదని హుజూర్ నగర్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్,అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా అన్నారు.బుధవారం పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో న్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో వారు కక్షిదారులను ఉద్దేశించి వారు మాట్లాడారు..
భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించబడిన సందర్భంగా న్యాయ దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత భారత రాజ్యాంగ రూపకల్పన కొరకు కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను నియమించి ఆ కమిటీ రూపొందించిన సుదీర్ఘమైన, లిఖితపూర్వకమైన ప్రపంచ దేశాలలోని ఇతర రాజ్యాంగాలలో కెల్లా మేటి అయిన రాజ్యాంగాన్ని నవంబర్ 26న ఆమోదించారని వారు గుర్తు చేశారు.
న్యాయవాదులు చనగాని యాదగిరి, కాల్వ శ్రీనివాసరావు, షేక్ సైదా హుస్సేన్, భూక్య నాగేశ్వరరావు, కీతా వెంకటేశ్వర్లు, బానోతు శంకర నాయక్, జక్కుల వీరయ్య, మీసాల అంజయ్య, నాగరాజు నాయక్, బుడిగ నరేష్, నారాయణ రెడ్డి, తదితర జూనియర్, సీనియర్ న్యాయ వాదులు, న్యాయ సేవ అధికార సంస్థ సిబ్బంది అనిత, సుశీల, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ ఫలాలను అందరూ పొందాలి..
నల్గొండ క్రైమ్, నవంబర్ 26: రాజ్యాంగం కల్పించిన అన్ని ఫలాలను పౌరులంతా పొందాలని జిల్లా అడిషనల్ ఎస్పి రమేష్ అన్నారు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన మాట్లాడారు, రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలనే ప్రతిజ్ఞ చేశారు.
రాజ్యాంగం దేశానికి మార్గదర్శకం, ప్రతి పౌరుడు దాని స్ఫూర్తిని కాపాడే బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.బి డియస్పి మల్లారెడ్డి, ఏ.ఓ శ్రీనివాసులు, ఆర్.ఐ లు సంతోష్, శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.
రాజ్యాంగం దేశప్రజల రక్షణ కవచం..
నల్గొండ రూరల్: దేశానికి భారత రాజ్యాంగం రక్షణ కవచం లాంటిదని జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి అన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బుదవారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆర్కే నారాయణ, ద్రౌపతి ముర్ము, జ్ఞాని జైల్ సింగ్ లాంటి వారు ఈ దేశ అత్యుత్తమ పౌరులుగా గుర్తించబడ్డారు అంటే భారత రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల ద్వారానే అన్నారు.. గొప్ప రాజ్యాంగాన్ని గౌరవించడం మన ప్రాథమిక హక్కుగా భావించాలన్నారు.
ఆరట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ ప్రియ విద్యార్థులందరిచేత భారత రాజ్యాంగాన్ని అందరం అనుసరిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.
మొదటి బహుమతి, టీ. శివ కుమార్ హిస్టరీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్, రెండో బహుమతి, పూజిత మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్, మూడో బహుమతి, ఆర్ హర్ష వర్ధన్ తెలుగు డిపార్ట్మెంట్, నాలుగవ బహుమతి జి ప్రియాంక, హిస్టరీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ గెలుపొందారు. కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ఆరట్స్ కళాశాల అధికారులు డాక్టర్ ఎం ఆనంద్, డాక్టర్ మహమ్మద్ షరీఫ్ వివిధ శాఖల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.