ప్రధాని మోదీతోనే దేశ ప్రగతి
05-05-2024 01:30 AM
జీడిమెట్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
మేడ్చల్, మే 4 (విజయక్రాంతి): ప్రధాని మోదీతోనే దేశ ప్రగతి సాధ్యమని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్రలో జరిగిన ప్రజ్ఞ భారతి కార్యక్రమానికి ఈటల హాజరయ్యారు. ఈ సందర్భంగా పదేండ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అంతకుముందు కాంగ్రెస్ పాలనా తీరును పరిశీలించి ఓటు వేయాలని కోరారు. అనంతరం జీడిమెట్ల డివిజన్ అయోధ్యనగర్, కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఈటలకు స్వాగతం పలికారు.




