11 June, 2026 | 3:45 AM

పేదల పక్షాన నిలబడే సీపీఐ, బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి

15-12-2025 01:46 AM

గరిడేపల్లి, డిసెంబర్ 14 : నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు వీరం రెడ్డి శంబిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని గానుగబండ, రంగాపురం గ్రామపంచాయతీల్లో బిఆర్‌ఎస్ మద్దతుతో సీపీఐ ఎర్రజెండా ఎగరడం ఖాయమని అన్నారు.

ఆదివారం మండలంలోని గానుబండలో బీఆర్‌ఎస్, సీపీఐ ఐక్యత సమావేశంలో పాల్గొని అనంతరం వారు ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థులు బడుగు,బలహీన వర్గాలకు అండగా ఉంటారని కావున వారిని అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. సీపీఐ నాయకులు కడియాల అప్పయ్య, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొత్త సతీష్రెడ్డి, షేక్ సైదా హుస్సేన్, కొత్త రామకృష్ణారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, పంగా గోవిందు, పోకల ఆంజనేయులు, ఈద ఆంజనేయులు, షేక్ నాగులమీరా, నబీసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.