calender_icon.png 19 December, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలాంటి పేచీ లేకుండా పంట కొనుగోలు చేయాలి

18-12-2025 12:00:00 AM

సోయా రైతులకు మద్దతుగా జడ్పీ మాజీ ఛైర్పర్సన్

బేల, డిసెంబర్ 17(విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్‌లో పండించిన సోయా పంటను ఎ లాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జైన థ్, బేల మార్కెట్ యార్డ్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బేల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ మేరకు సుహాసిని రెడ్డి మా ట్లాడుతూ... గత నెలరోజులుగా వివిధ నిబంధనల పేరిట పంట కొనుగోలు చేయకపో వడంతో రైతులు మార్కెట్ లోనే పడిగాపులు కాస్తున్న పట్టించుకునే నాథుడే లేరని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు రైతులు పాల్గొన్నారు.