calender_icon.png 15 July, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్ల నిరీక్షణకు తెర

15-07-2025 12:57:14 AM

- కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ!

- జిల్లాలో 78,179 కుటుంబాలకు ప్రయోజనం

- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

కరీంనగర్, జూలై14(విజయక్రాంతి): పదేళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూ స్తున్న కొత్త రేషణ్ కార్డ్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూ ర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాన కొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా 5.61 లక్షల రేషన్ కార్డులు జారీ కానుండగా, కరీంనగర్ జిల్లాలో 78,179 తెల్ల రేషన్ కార్డు లు పంపిణీ కానున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి తెలిపారు. జిల్లాలోని 16 మండలాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఒకటవ దశలో 38282 మంది, రెండో దశలో 47,120 మందిని కలుపుకొని మొత్తం 78,179 రేషన్ కార్డులు పంపిణి కానున్నాయని ఆయన చెప్పారు.

ఇక మండలాల వారీగా చూస్తే మానకొండూర్ మండలంలో 5113 కొత్త రేషన్ కార్డులు, తిమ్మాపూర్ మండలంలో 3,366 , శంకరపట్నం మండలంలో 3,256 కార్డులు, గన్నే రువరం మండలంలో 1,520, కరీనగర్ కా ర్పొరేషన్ పరిధిలో 18,484, కరీంనగర్ మండలంలో 4,381, కొత్తపల్లి మండలంలో 5,079, రామడుగు మండలంలో 4,315 , సైదాపూర్ మండలంలో 3,098, హుజూరాబాద్ మండలంలో 6,031, జమ్మికుంట మండలంలో 5,060, ఇల్లందకుంట మండలంలో 2,374, వీణవంక మండలంలో 3929, చొప్పదండి మండలంలో 3,842, చిగురుమామిడి మండలంలో 3,172, గంగాధర మండలంలో 5,159 కొత్త కార్డులు జారీ కానున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వివరించారు.

ఇక నుంచి పాత వారితోపాటు కొత్త రేషన్ కార్డు దారు లు కూడా చౌకధరల దుకాణాల నుంచి సన్న బియ్యం పొందుతారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులపై నాణ్యత కలిగిన సన్నబియ్యం ఇస్తున్న మాదిరిగా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. కార్డుల జారీ ప్రకియ నిరంతర కొనసాగుతున్నందున ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిఆయనతెలిపారు.