calender_icon.png 16 July, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ భావం, దేశభక్తి పెంపొందించడమే ‘తపస్’ లక్ష్యం

15-07-2025 10:45:58 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యార్థుల్లో జాతీయ భావం, దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా తపస్ ఉపాధ్యాయ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడి బోయిన గోపికృష్ణ అన్నారు. కేసముద్రం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో తపస్ ఉపాధ్యాయ సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపస్ ఉపాధ్యాయ సంఘం అఖిల భారత రాష్ట్రీయ సైక్షానిక్ మహాసంగ్ అనుబంధంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాగి సోమనసయ్య చారి, ఓమ సంతోష్, రాజు, సామల రమేష్ పాల్గొన్నారు.