15-07-2025 10:58:13 PM
కోదాడ: కోదాడ పట్టణంలోని మీసేవలపై అధికారులు మంగళవారం అధికారి ఎండి గఫూర్ దాడులు నిర్వహించారు. మున్సిపాలిటీ సమీపంలోని మీసేవ తనిఖీ చేయగా ఓనర్ అందుబాటులో లేడు అని, ఆపరేటర్ వేలిముద్ర తోటే మీసేవ నడుపుతున్నట్లు వారి దృష్టికి వెళ్ళింది. అంతేకాకుండ లేబర్ కార్డులు అప్లై చేయడం, వాటికి సంబంధించినవి ఎక్కువగా అదే మీ సేవలో జరగడంతో వాటిపై ఆరాధిశారు. మీ సేవలో టోల్ ఫ్రీ నెంబర్లు డిస్ప్లేలో ఉంచాలని సూచించారు. గతంలో కూడా అనేక ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారని పలువురు తెలుపుతున్నారు. అదేవిధంగా తాసిల్దార్ కార్యాలయ సమీపంలో మరో మీసేవను కూడా తనిఖీ చేశారు.