15-07-2025 10:48:08 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని, పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంధసిరి జ్యోతి బసు, పట్ల మధు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ విద్య పట్ల నిర్లక్ష్య వైఖరి వీడాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నిక్షిప్త, గుండ్ల రాకేష్, కొలిపాక వీరేందర్, బాసు, ఉదయ్, పవన్, మహేష్, వరుణ్, వంశీ, యాకన్న తదితరులు పాల్గొన్నారు.