calender_icon.png 16 July, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్న ప్రజలు : రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రాంచందర్ రావు

15-07-2025 11:10:54 PM

రాష్ట్రంలో కాంగ్రెస్ ది అవినీతి, ప్రజా వ్యతిరేక పాలన

ఘట్ కేసర్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాoచంద్రరావు అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ అవుషాపూర్ లోని పిపిఆర్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర స్థాయి కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాదిరిగానే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అవినీతి, ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తోందని విమర్శించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నల్లగొండ, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో నా మొట్టమొదటి పర్యటన చేశానని ఈపర్యటనలో వివిధ వర్గాల ప్రజలను కలిసి నట్లు తెలిపారు. గ్రామాల్లో బిజెపి బలం పెరుగుతోందని, ప్రజలు బిజెపి ప్రభుత్వం రావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. గతంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారని, ప్రతి ఎన్నికలో బిజెపి ఓటుశాతం, ప్రాతినిధ్యం స్థిరంగా పెరుగుతోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలిచేలా విజయసంకల్పంతో ముందుకు సాగాలని అందుకు కార్యకర్తలు, నాయకులు ముందుకు రావాలి, అందరం కలిసిమెలిసి ముందుకు నడవాలనీ పిలుపునిచ్చారు. 

బిజెపిని గెలిపించాలనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, బిజెపి నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అందులో 10 శాతం మతపరమైన రిజర్వేషన్లను కలుపాలని చూస్తోందని ఇది బీసీలకు వ్యతిరేకమైన చర్య ఉన్నారు. మతపరమైన కారణాల వల్లే ఆనాడు భారతదేశ విభజన జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగాల్లో మతపరమైన 4 శాతం రిజర్వేషన్లను బిజెపి గతంలోనే వ్యతిరేకించిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తోందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించాలి, ప్రజల కోసం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ఒక్క ప్రాంతానికి పరిమితమవకుండా, యావత్ తెలంగాణ వ్యాప్తంగా బిజెపి ఓటుశాతం పెరుగుతోందన్నారు. ఇది మరింత పెరిగేలా బలమైన విశ్వాసంతో మనమంతా ముందుకు సాగాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు  అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచేలా కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18, 19, 20వ తేదీలలో జిల్లా వర్క్ షాపులు అన్ని పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. 21, 22, 23 తేదీలలో మండల స్థాయిలో వర్క్ షాపులు పూర్తిచేయాలని అలాగే 29 30వ తేదీలలో పూర్తిస్థాయిలో ఇంటింటికి వెళ్లి తలుపులు తట్టి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఆగస్టు 1, 2, 3వ తేదీలలో మండల వారిగా ర్యాలీలు, అలాగే 4, 5 తేదీలలో జిల్లా కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు.