calender_icon.png 16 July, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా హఫీజ్‌ఖాన్

15-07-2025 12:57:07 AM

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ శుభాకాంక్షలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): నల్లగొండ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా హఫీజ్‌ఖాన్ నియమితులయ్యారు. ఆయనకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈ వో, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎంవి గోనరెడ్డితోపాటు ఉపాధ్యాయ వర్గం (ఉద్యోగులు, పదవీ విరమణ చేసినవారు), ఉద్యోగ సంఘాల తరపున శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన పదవీకాలంలో ప్రజా గ్రంథాలయా లు గణనీయమైన అభివృద్ధిని సాధిస్తాయని వారు ఆశిస్తున్నారు. ఈ గ్రంథాలయాలు జిల్లాలోని ప్రజలందరి విభిన్న అవసరాలను తీరుస్తూ తమ సేవలను మెరుగుపరుస్తాయ ని సమాజం ఆశిస్తోంది. చైర్మన్‌గా హఫీజ్ ఖాన్ పదవీకాలం విజయవంతం కావాలని ఎంవి గోనరెడ్డి కాంక్షించారు.