15-07-2025 10:51:38 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 2న శ్రీ రైతు మిత్ర ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగవకాశాలను నిర్వహించిన జాబ్ మేళాలో 23 మందికి ఉద్యోగాలు లభించినట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత తెలిపారు. జాబ్ మేళాకు 52 మంది అభ్యర్థులు పాల్గొనగా అందులో 23 మంది ఎంపికయ్యారని, ఎంపికైన అభ్యర్దులకు నేడు అనగా మంగళవారం కలెక్టరేట్ లోని జిల్లా ఉపాధి శాఖ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల శాఖ, జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ చేతుల మీదుగా నియామకం పత్రాలను అందజేశారు. శ్రీ రైతు మిత్ర ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మహబూబాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఎంపికైన వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంపెని జిల్లా మేనేజర్ మమత, జిల్లా ఉపాధి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.